Thursday, January 23, 2025

విమానాశ్రయాలు మినహా అమెరికాలో 5 జి సేవలు అందుబాటులోకి

- Advertisement -
- Advertisement -

5G services available in the US except for airports

విమానయాన సంస్థల అభ్యంతరంతో మినహాయింపులు

వాషింగ్టన్: అమెరికాలో ఇంటర్నెట్‌ను వేగవంతం చేసే 5 జి సేవలు వివాదాస్పదంగా మారాయి. 5జిని ప్రారంభిస్తే విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎయిర్‌లైన్స్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దాంతో, ఎయిర్‌లైన్స్ ప్రాంతాల్లోని తమ టవర్ల నుంచి సేవలను కొంతకాలం నిలిపి వేసేందుకు మొబైల్ సంస్థలు అంగీకరించాయి.

ఏమిటీ 5 జి గొడవ..?

5 జి నెట్ వర్క్‌ను అందించే సి బ్యాండ్ సేవలు అమెరికాలో బుధవారం ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని చోట్ల వాయిదాకు అంగీకరించినట్టు టెలికాం సంస్థలు తెలిపాయి. అయితే, తాము ఒత్తిడితోనే నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఫెడరల్ ఏవియేషన్ అలసత్వం వల్ల 5 జి సేవల్ని రెండేళ్లుగా వాయిదా వేస్తూ వచ్చామని తెలిపాయి. దాదాపు 40 దేశాల్లో ఇప్పటికే 5 జి సేవలు అందుబాటులోకి వచ్చాయని ఎటి అండ్ టి సంస్థ తెలిపింది. ఆ దేశాల్లో విమానయానానికి అంతరాయం లేకుండా చేశారని తెలిపింది. విమానాశ్రయాల వద్ద ఉన్న టవర్ల వద్ద మాత్రమే తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, మిగతాచోట్ల ప్రారంభిస్తున్నామని తెలిపింది. ఎటి అండ్ టి, వెరిజోన్ సంస్థలు అమెరికాలో 5 జి సేవల్ని అందిస్తున్నాయి. 5 జి సేవలు విమానాశ్రయాల వద్ద అల్టీమీటర్లవంటి సున్నితమైన పరికరాల్ని ప్రభావితం చేస్తాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌ఎఎ) హెచ్చరించింది.

5జి సేవలు ప్రారంభిస్తే లోవిజన్‌లో రాకపోకలు సాగించే విమానాలన్నీ నిలిపివేయాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. దాంతో, విమానాశ్రయాలకు సమీపంలో 5 జి టవర్లు ఉండకుండా చూడాలని విమానయాన సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు వైట్‌హౌస్ అధికారులు జోక్యం చేసుకోవడంతో మొబైల్ సంస్థలు వాయిదాకు అంగీకరించాయి. వాయిదాకు ఒప్పుకున్నందుకు ఎటి అండ్ టి, వెరిజోన్ సంస్థలకు అధ్యక్షుడు జోబైడెన్ కృతజ్ఞతలు తెలిపారు. 10 శాతం టవర్ల వద్ద మాత్రమే 5జి సేవలు తాత్కాలికంగా వాయిదా పడుతున్నాయని ఆయన తెలిపారు. దీనిపై శాశ్వత పరిష్కారం దిశగా నిపుణులతో సమాలోచనలు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News