Friday, November 15, 2024

అక్టోబర్ నుంచి 5జి సేవలు

- Advertisement -
- Advertisement -

5G services from October

ముగిసిన 5జి స్పెక్ట్రమ్ వేలం
టాప్ బిడ్డర్‌గా నిలిచిన రిలయన్స్ జియో
రూ.1.5 లక్షల కోట్ల బిడ్లను అందుకున్న టెలికామ్ శాఖ

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ వేలం ప్రక్రియలో నాలుగు టెలికాం కంపెనీలు రూ.1,50,173 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ కోసం బిడ్ చేశాయి. ఇది ప్రభుత్వ అంచనా కంటే చాలా ఎక్కువ నమోదైంది. 5జి స్పెక్ట్రమ్ వేలం జూలై 26న ప్రారంభం కాగా, ఇది 7 రోజుల పాటు కొనసాగింది. గతేడాది 4జి స్పెక్ట్రమ్‌కు రూ.77,815 కోట్ల విలువ బిడ్‌లు వచ్చాయి. అయితే 5జి బిడ్డింగ్‌లో రిలయన్స్ జియో అత్యధికంగా రూ.57,122 కోట్ల బిడ్‌లను వేసింది. భారతీ ఎయిర్‌టెల్ రూ.18,699 కోట్ల బిడ్లను చేసింది.

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వేర్వేరు బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ కోసం దూకుడుగా వేలం వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వేలంలో ఉంచిన బ్యాండ్‌లన్నింటికీ మంచి పోటీ ఉందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2016, 2021లో జరిగిన వేలంలో 700 మెగా హెర్ట్ బ్యాండ్‌కు కొనుగోలుదారు ఎవరూ లేరు, కానీ ఇప్పుడు బాగుందని ప్రభుత్వం తెలిపింది. అయితే 5జి స్పెక్ట్రమ్ వేలంలో రూ.1,50,173 కోట్ల బిడ్‌లతో ప్రభుత్వ అంచనా కంటే చాలా ఎక్కువగా ఉంది. అలాగే 2015లో వేలం ద్వారా వచ్చిన రూ.1.09 లక్షల కోట్ల రికార్డు స్థాయి ఆదాయం రాగా, దాని కంటే ఇది ఎక్కువగా ఉంది. వేలంలో ఉత్తరప్రదేశ్ (తూర్పు) మార్కెట్ కోసం 1800 మెగా హెర్ట్‌కు డిమాండ్ కనిపించింది. యూపీ- ఈస్ట్ సర్కిల్‌కు యూనిట్ ధర 76.5 శాతం పెరిగి రూ.91 కోట్ల నుంచి రూ.160.57 కోట్లకు చేరుకుంది.

టెలికాం కంపెనీలకు 5జి స్పెక్ట్రమ్ కేటాయింపు తర్వాత 2022 అక్టోబర్‌లో దేశంలోని అనేక పెద్ద నగరాల్లో 5జి మొబైల్ సేవలను ప్రారంభించనున్నారు. అయితే 5జి మొబైల్ సేవను ప్రవేశపెట్టిన తర్వాత మొబైల్, ఇంటర్నెట్ ప్రపంచం మారనుంది. 5జి వేగం 4జి కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 5జి సేవ ప్రారంభమైన తర్వాత ఆటోమేషన్ కొత్త శకం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు పెద్ద నగరాలకే పరిమితమైన విషయాలు గ్రామాలకు అందుబాటులోకి వస్తాయి. వీటిలో ఇ-ఔషధం, విద్య, వ్యవసాయ రంగం గొప్ప ప్రయోజనం లభిస్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News