Monday, January 20, 2025

రెండేళ్లలో దేశంలోని గ్రామాలకు 5జి సేవలు: ఎయిర్‌టెల్ ఎండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ 5జి స్పెక్ట్రమ్ సేవలను ఈ నెల నుంచే ప్రారంభించనుంది. 2024 మార్చి నాటికి దేశంలోని కీలక గ్రామాలకు 5జి సేవలు చేరుకుంటాయని కంపెనీ ఎండి, సిఇఒ గోపాల్ విఠల్ తెలిపారు. భారతదేశంలో మొబైల్ సేవలకు ధరలు చాలా కనిష్ట స్థా యిలో ఉన్నాయని, ఈ రేట్లు పెరగాల్సి ఉందని అ న్నారు. ‘ఆగస్టు నెలలోనే 5జి సేవలను ప్రారంభిం చి, త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తాం, 2024 మా ర్చి నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాం’ అని ఆయన అన్నారు. జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసి క ఫలితాల్లో ఎయిర్‌టెల్ నికర లాభం రూ.1,607 కోట్లతో 466 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.284 కోట్లుగా ఉంది.

కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ. 32,805 కోట్లతో 21 శాతం పెరగ్గా, గతేడాదిలో ఈ ఆదాయం రూ.27,064 కోట్లుగా ఉంది. ఈ నెలలో 5జి నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు గాను స్వీడన్ కంపెనీ ఎరిక్సన్, ఫిన్లాండ్ సంస్థ నోకియా, కొరియా సంస్థ సామ్‌సంగ్‌లతో ఎయిర్‌టెల్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. సామ్‌సంగ్‌తో భా గస్వామ్యం ఈ ఏడాది నుంచి ప్రారంభం కానుందని టెలికాం సంస్థ ప్రకటించింది. దేశీయ తొలి 5జి స్పెక్ట్రమ్ వేలంలో 900 మెగాహెర్ట్, 1800 మెగాహెర్ట్, 2100 మెగాహెర్ట్, 3300 మెగాహెర్ట్, 26 గిగా హెర్ట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో ఎయిర్‌టెల్ 19867.8 మెగాహెర్ట్ స్పెక్ట్రమ్‌ను రూ. 43,084 కోట్లతో సొంతం చేసుకుంది. ఈ బ్యాండ్‌లతో ఎయిర్‌టెల్ దేశంలోని కీలక నగరాల్లో 5జి సేవలను ప్రారంభించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News