Wednesday, January 22, 2025

నెల రోజుల్లో 5జి సేవలు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

5G services within a month: Centre

న్యూఢిల్లీ : చాలా కాలంగా వేచిచూస్తున్న హై స్పీడ్ 5జి సేవలను నెల రోజుల్లో ప్రారంభించనున్నామని కేంద్ర టెలికామ్ సహాయమంత్రి దేవుసిన్హ్ చౌహాన్ వెల్లడించారు. ఆసియా, ఒసియన్ రీజియన్‌కు టెలికమ్యూనికేషన్ యూనియన్స్ రీజినల్ స్టాండర్డైజేషన్ ఫోరమ్(ఆర్‌ఎస్‌ఎఫ్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడుతూ, 5జి సేవల కోసం ఈ ఏడాది ముగింపు నాటికి దేశీయంగా తయారు చేసిన 5జి టెలికామ్ గేర్లను భారతదేశం ప్రారంభించనుందని అన్నారు. నెల రోజుల్లో 5జి సేవలను ప్రారంభించనున్నామని, 6జి టెక్నాలజీ ఇన్నోవేషన్స్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశామని, ఇది దేశీయ 6జి స్టాక్ అభివృద్ధి దిశగా పనిచేస్తోందని చౌహాన్ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News