Wednesday, January 22, 2025

5జితో స్కూళ్ల రూపురేఖలు మారుతాయి: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

5G Will Change School Education: PM Modi
5జితో స్కూలు విద్యా రూపం మారుతుంది
కొత్త విద్యావిధానంతో ఆంగ్ల ఆధిపత్యానికి చెక్
గుజరాత్ విద్యా లక్షం ఆరంభంలో ప్రధాని మోడీ
ప్రతిభకు ప్రాంతీయ భాషల అడ్డంకి అనుచితం
అదాలజ్(గుజరాత్): దేశంలో 5జి సాంకేతికత విద్యావ్యవస్థను సమున్నత స్థాయికి తీసుకువెళ్లుతుందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తెలిపారు. ఇకపై స్కూళ్ల రూపురేఖలు మారుతాయి. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాల స్థాయిలో విద్యాభ్యాసానికి వీలేర్పడుతుందని చెప్పారు. విద్యావ్యవస్థ తదుపరి దశను అందుకునేందుకు 5జి టెక్నాలజీ దోహదం చేస్తుందన్నారు. గుజరాత్‌లోని అదాలజ్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిభాయుత స్కూళ్ల లక్షం కార్యక్రమాన్ని ఉద్ధేశించి ప్రధాని ప్రసంగించారు. విద్యాబోధన ఇకపై హైటెక్ రీతిలో సాగేందుకు రంగం సిద్ధమైంది. స్మార్ట్ సౌకర్యాలు, స్మార్ట్ క్లాసురూంలు, స్మార్ట్ టీచింగ్ ప్రక్రియల స్థాయి దాటుతుందని, సాంకేతికను మేళవించుకుని విద్యాబోధన జరగడం ద్వారా విద్యార్థులకు మరింతగా ప్రామాణిక విద్య అందుతుందన్నారు.

కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం (నెప్) ఆంగ్ల దాస్య మనసత్వత్వం నుంచి భావితరాలను మళ్లిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. తాను భాష గురించి ప్రస్తావించడం లేదు కానీ ఇంగ్లీషు చుట్టూ అల్లుకుని ఉన్న దాస్య వైఖరి నుంచి దేశం బయటపడేందుకు దారితీస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇంగ్లీషు భాష కేవలం సమాచార మాధ్యమంగా భావించినా దీనిని ఇప్పుడు మేధావి లక్షణం అనే స్థాయి ఏర్పడిందని ప్రధాని తెలిపారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గుజరాత్‌లో విద్యారంగ భావి అవసరాల లక్షాల దిశలో ఇప్పుడు ఈ గణనీయ కార్యక్రమం ఏర్పాటు అయిందని ప్రశంసించారు. దీని వల్ల రాష్ట్రంలో విద్యా ప్రాథమిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అధునాతన విద్యావ్యవస్థ దిశలో దూసుకువెళ్లేందుకు వీలేర్పడుతుందని తెలిపారు. క్లాసురూంలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, పూర్తి స్థాయిలో విద్యావ్యవస్థ నవీకరణకు మార్గం ఏర్పడుతుందని వివరించారు. ఈ దిశలో ఇటీవల ప్రవేశపెట్టిన 5 జి ఇంటర్నెట్ సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు.

విద్యార్థులు ఈ ప్రక్రియలతో ఇకపై వర్చువల్ వాస్తవికతను మరింతగా పొందగల్గుతారు. ఇంటర్నెట్ పరిజ్ఞానం సంతరించుకుంటారు, స్కూళ్లలోనే అత్యంత అధునాతన ఐటి పరిజ్ఞానాన్ని నేర్చుకునేందుకు వీలేర్పడుతుందని ప్రధాని తెలిపారు. ఆంగ్లభాషపై పట్టులేని వారు ప్రాంతీయ భాషలలో విద్యాభ్యాసం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేందుకు అనువైన వాతావరణాన్ని తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రతిభకు భాషను ప్రతిబంధకం చేయరాదు. భాషా ప్రావీణ్యం లేనందున విషయ పరిజ్ఞానంలో విద్యార్థులను వెనకకు నెట్టాల్సిన పనిలేదని, గతకాలపు చారిత్రక పరిణామాలతో ఆంగ్లం సార్వత్రిక మాధ్యమిక సాధనం అయి ఉండవచ్చు. అయితే, ఇది పూర్తిగా విజ్ఞానదాయక భాష దీనిని నేర్చుకున్న వారే మేధావులు అని అనుకోవడానికి వీల్లేదని ప్రధాని తెలిపారు. అయితే ఇప్పటికీ వాస్తవికంగా చూస్తే భాషపరమైన అడ్డంకులతో పలువురు ప్రతిభావంతులైన యువత తాము ఆశించిన విధంగా డాక్టర్లు, ఇంజనీర్లు కాలేకపొతున్నారు. ఈ ఇబ్బందిని గుర్తించి సరిదిద్దాల్సి ఉందన్నారు.

5G Will Change School Education: PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News