Saturday, December 21, 2024

ఓటు హక్కు నమోదు, సవరణలపై నేడు 5కె అవగాహన రన్

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకర్గ కేంద్రాల్లో శనివారం ‘ ఐ ఓటు ఫర్ ష్యూర్ ’ నినాదంతో 5కె రన్ ఘనంగా నిర్వహించాలని – ఎన్నికల అధికారి రోనాల్ రోస్ ఈఆర్‌ఓలను అదేశించారు. అర్హత గల వారందరినీ ఓటరుగా నమోదు చేయడంతోపాటు తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు తప్పుల సవరణ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను శనివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 5కె రన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేబీఆర్ పార్క్ లో 5కె రన్‌ను పెద్ద ఎత్తున నిర్వహించాల్సిందిగా ఈ ఆర్‌ఓను అదేశించారు. ఈ రన్‌లో ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, యువకులు, ఆసక్తి ఉన్నవారందరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News