- Advertisement -
హైదరాబాద్: హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వి విహబ్ 5వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… రూ.1.30 కోట్లు ఇస్తే వి హబ్ నుంచి ఒక స్టార్ట్ అప్ తో రూ.70 కోట్లకు పెంచారని చెప్పారు. స్త్రీనిధి కింద మహిళలకు రుణాలు అందిస్తున్నాం. రూ.750 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. యువత ఎందుకు వ్యాపారవేత్తలు అవ్వకూడదు..? అని ప్రశ్నించారు. ప్రతీ పారిశ్రామిక పార్క్ లతో 10 శాతం ఫ్లాట్స్ మహిళలకు కేటాయించామని వెల్లడించారు. ప్రతీ 3 కోవిడ్ టీకాల్లో రెండు హైదరాబాద్ నుంచి వచ్చాయన్నారు. మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. స్రీ, పురుషులకు సమానంగా నే ప్రతిభ ఉంటుందని మంత్రి కెటిఆర్ తెలిపారు.
- Advertisement -