Wednesday, January 22, 2025

మన గురుకులాల్లో అద్భుత ఫలితాలు

- Advertisement -
- Advertisement -

5th class Gurukul entrance test results released

దేశ విదేశాల్లో పేరు ప్రతిష్ఠలు
5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

మన తెలంగాణ / హైదరాబాద : మన రాష్ట్రంలోని గురుకులాలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సమాజంలో అన్ని వర్గాల వారికి నాణ్యతా ప్రమాణాలతో ఉచిత విద్య నందించాలనే ధృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని అన్నారు. అన్ని గురుకుల సొసైటీల్లో 5వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను మంత్రి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా క్యాంపు కార్యాలయంలో మంత్రి అధికారులతో గురుకులాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మన గురుకులాల పేరు ప్రతిష్ఠలు ఉన్నాయని, వీటికి మరింత వన్నె తెచ్చేందుకు మనమందరం అంకిత భావంతో ముందుకు సాగుదామని మంత్రి చెప్పారు. పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడేలా, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ఐఎఎస్, ఐపిఎస్ అధికారులయ్యేలా మరింత శ్రద్ధ చూపాలని అధికారులను కోరారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు “ సహజ ” పేరుతో నిత్యావసరాలను ఉత్పత్తి చేస్తున్నారని మంత్రి అధికారులకు వివరించారు.

వీటిలో సబ్సులు, షాంపులు, తల నూనెలు, కాస్మోటిక్స్ లు ఉన్నాయని అవి నాణ్యమైనవి, మన్నికైనవి, చౌకైనవని మంత్రి తెలిపారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా తయారు చేస్తున్న ఈ వస్తువుల వాడకం వల్ల విద్యార్థుల ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. వీటిని పరిశీలించి అన్ని గురుకులాలు, హాస్టళ్ళకు సరఫరా చేసే విషయమై సానుకూల నిర్ణయం తీసుకోవాలసిందిగా మంత్రి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్‌షి, ఎస్‌టి గురుకుల సొసైటి కార్యదర్శి రోనాల్డ్ రాస్, బిసి గురుకుల సొసైటి కార్యదర్శి మల్లయ్య బట్టు, అధికారులు హన్మంతు నాయక్, సర్వేశ్వర్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాలుగు సొసైటీల ఆధ్వర్యంలో 605 సాఠశాలలు ఉండగా ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం మే 8న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 48,440 సీట్లకు గాను 1,47,924 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఈ సంఖ్య కేవలం 87,773 మాత్రమే కావడం గమనార్హం. గురుకులాల్లో ఇంగ్లీషు మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తుండడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ పాఠశాలల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News