Monday, December 23, 2024

ఆ రెండు లేఖలు చెప్పలేని ఆనందం కలిగించాయి

- Advertisement -
- Advertisement -

5th class students writes letter to RTC MD

ఆ విద్యార్థుల బంగారు భవిష్యత్ బాగుండాలి
ఆర్టీసి వైస్ చైర్మన్, ఎండి సజ్జనార్

మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యార్థుల నుంచి వచ్చిన రెండు లేఖలు చదివినప్పుడు మాటల్లో చెప్పలేని ఆనందం కలిగిందని టిఎస్ ఆర్టీసి వైస్ చైర్మన్, ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. ఆదిభట్ల మండల ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులు (5వ తరగతి చదువుతున్న) జి. ఐశ్వర్య, బి.మేఘనల నుంచి రెండు లేఖలు తనకు అందాయని, ఈ లేఖలను చదివినప్పుడు మాటల్లో చెప్పలేని అపారమైన సంతృప్తి కలిగిందని ఆయన తెలిపారు. ఆ విద్యార్థుల బంగారు భవిష్యత్ బాగుండాలని తాను కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.

ఐశ్వర్య, మేఘనలు రాసిన లేఖలోని వివరాలు ఇలా…

మిధాని డిపో నుంచి ఉదయం, సాయంత్ర వేళల్లో బస్సును ప్రారంభించారు. గతంలో వర్షం పడితే తాము స్కూల్‌కు వెళ్లలేకపోయే వాళ్లం. ప్రస్తుతం మా గురించి బస్సును నడపడం వల్ల విద్యార్థులందరూ సక్రమంగా స్కూల్‌కు వెళ్లగలుగుతున్నాం. మా సమస్యను తీర్చినందుకు మీకు ధన్యవాదాలు అంటూ 5 వ తరగతి విద్యార్థులు సజ్జనార్‌కు కృతజ్ఞత లేఖ రాశారు. వారి లేఖలను చదివిన సజ్జనార్ సంతోషం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News