- Advertisement -
వెల్లింగ్టన్: న్యూజీల్యాండ్‌లోని ఉత్తర దీవిలో బుధవారం 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. న్యూజీల్యాండ్ రాజధాని వెల్లింగ్టన్ నగరానికి ఉత్తరాన 55 కిలోమీట్ల దూరంలోని ఉత్తర దీవిలో స్థానిక కాలమానం సాయంత్రం 7.38 గంటలకు భూకంపం సంభవించినట్లు వార్తాసంస్థలు తెలిపాయి. భూగర్భంలో 55 కిలోమీటర్ల లోపల భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలిపాయి. భూకంప తాకిడి ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి ఇప్పటివరకు వార్తలేవీ రాలేదు.
- Advertisement -