Sunday, January 19, 2025

నేపాల్ రాజధాని ఖాట్మండులో భూకంపం

- Advertisement -
- Advertisement -

ఖాట్మండు : నేపాల్ రాజధాని ఖాట్మండులో ఆదివారం ఉదయం రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలకు 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. థడింగ్ జిల్లాలో ఉదయం 7.39 గంటలకు భూకంప తీవ్రత కేంద్రీకృతమైనట్టు జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన సంస్థ తెలియజేసింది. బాగ్మతి, గండకీ ప్రావిన్స్‌లకు కూడా ఈ ప్రకంపనలు విస్తరించాయి. అయితే ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టు వివరాలు లేవు. కుమల్తరి, జ్వాలాముఖి రూరల్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 20 ఇళ్లు దెబ్బతిన్నాయని, మరో 75 ఇళ్లకు బీటలు పడ్డాయని మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే తరచుగా ప్రకంపనలు సంభవిస్తుండడంతో ఇళ్లు విడిచి ప్రజలు బయటనే చాలాసేపు గడపవలసి వచ్చిందని స్థానికులు తెలిపారు. ఉదయం 7.39 గంటల తరువాత 4.3 తీవ్రతతో ఉదయం 8.08 గంటలకు, 4.1 తీవ్రతతో ఉదయం 8.59 గంటలకు, భూకంప ప్రకంపనలు సంభవించాయని ఎర్త్‌క్వాక్ మెజర్‌మెంట్ సెంటర్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News