- Advertisement -
జకర్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కెపులవన్ బరత్ దయాలో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదయిందని యూరోపియన్-మెడిటేరియన్ సీస్మోలజికల్ సెంటర్ వెల్లడించింది. కెపులవన్ బరత్ దయాకు ఈశాన్యంగా 86 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో 131 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. భూకంపం కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొంది.
6.4 Magnitude of Earthquake in Indonesia
- Advertisement -