Saturday, March 29, 2025

జపాన్ లో 6.9 తీవ్రతతో భూకంపం

- Advertisement -
- Advertisement -

టోక్యో: జపాన్ లోని బోనిన్ దీవులు లేక ఓగసవారా దీవులలో శనివారం 6.9 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. ఈ విషయాన్ని ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. భూకంపం సాయంత్రం 5.36 గంటలకు (08.36 గ్రీన్విచ్ మీన్ టైమ్)కు సంభవించిందని, ఇది 540 కిమీ. లోతుతో, 7 సీస్మిక్ ఇంటెన్సిటీ స్కేల్ లో 3గా నమోదయిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. టోక్యోకు దక్షిణాన 875 కిమీ. దూరంలో పశ్చిమ కోస్తాలో భూకంపన కేంద్రబిందువు నమోదయింది. దీనివల్ల టోక్యోలో బలహీన కంపనాలు వచ్చాయి. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News