Tuesday, November 5, 2024

వెనుకంజలో ఆరుగురు బిజెపి మంత్రులు!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు 2023లో బిజెపికి పెద్ద షాక్… ఓట్ల లెక్కింపు సందర్భంగా కర్నాటకలోని ఆరుగురు బిజెపి మంత్రులు వెనుకంజలో కొనసాగుతున్నారు. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ మూడో రౌండ్ లెక్కింపు తర్వాత 15098 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య రెండో రౌండ్ కౌంటింగ్ తర్వాత 1224 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఆయన వరుణ సీటులో గృహ శాఖ మంత్రి వి. సోమన్న కన్నా ముందంజలో ఉన్నారు. చామరాజ్ సీటు నుంచి కూడా పోటీచేస్తున్న సోమన్న అక్కడ కూడా 9000 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పుట్టరంగ శెట్టి ముందంజలో ఉన్నారు.

క్రీడా, యువజన సేవల శాఖ మంత్రి డా. కె.సి.నారాయణ గౌడ రెండో రౌండ్ లెక్కింపుకల్లా 3324 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఆయనపై జెడి(ఎస్) అభ్యర్థి హెచ్.టి. మంజు ఆదిక్యతలో ఉన్నారు.

పిడబ్య్లుడి శాఖ మంత్రి సిసి. పాటిల్ నావల్‌గుండ్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బి.ఆర్. యావగల్ కన్నా 544 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News