Wednesday, January 22, 2025

క్రాస్ ఓటింగ్.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు

- Advertisement -
- Advertisement -

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో క్రాస్ ఓటింగ్ రగడ నెలకొంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఫిబ్రవరి 27వ తేద మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బిజెపి అభ్యర్థికి ఓటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ మరుసటి రోజునే ఓ కాంగ్రెస్ మంత్రి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ మైనార్టీ ప్రమాదంలో పడింది.

ఈ క్రమంలో బలం నిరూపించుకునేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బిజెపి నాయకులు.. స్పీకర ను కోరారు. మొత్తం 40 సీట్లలో ఆరుగురిపై వేటు పడడంతో కాంగ్రెస్ బలం 34కు పడిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సమావశమైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News