- Advertisement -
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్‌లో అనర్హతకు గురైన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమపై స్పీకర్ కుల్దీప్‌సింగ్ అనర్హత వేటు వేయడం అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని ఎమ్‌ఎల్‌ఎలు అంటున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ సభ్యుడు హర్ష్‌మహాజన్‌కు ఓటు వేయడంతో ఆ అభ్యర్థి గెలుపొందారు.
కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఓడిపోయారు. ఆరుగురు ఎమ్‌ఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కుల్దీప్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ కోరింది. దాంతో ఆరుగురిపై స్పీకర్ అనర్హత వేటు పడింది. తమ అనర్హతపై గతవారం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు.
- Advertisement -