- Advertisement -
ముంబై: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం అహ్మద్ నగర్ జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఐసీయూలోని ఆరుగురు కరోనా రోగులు సజీవ దహనమయ్యారు. మరో 11మంది రోగులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
6 Corona patients died as fire breaks out in Maharashtra
- Advertisement -