Friday, November 15, 2024

ఎపిలో విషాదం: సీలేరు నదిలో రెండు పడవలు బోల్తా.. ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీలేరు నదిలో రెండు నాటుపడవల బోల్తా ఘటనలో గల్లంతైన 11 మందిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం నుంచి ముగ్గురు బయటపడి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాగా మంగళవారం రాత్రి చీకటి పడటంతో గాలింపు చర్యలను సిబ్బంది నిలిపివేశామని, మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం బుధవారం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా ప్రమాద సమయంలో రెండు పడవల్లో 11మంది ప్రయాణిస్తున్నారు. బాధితులు ఒడిశాలోని కోందుగూడ గ్రామస్తులు కాగా వీరు హైదరాబాద్ శివారులో ఇటుకుల బట్టిలో పనికి వెళ్లి కోవిడ్ భయంతో 35మంది గ్రామానికి బయలుదేరారు. సీలేరు రిజర్వాయిర్ మీదుగా నాటు పడవలపై తొలి విడతగా కొందరు గ్రామానికి సురక్షితంగా చేరుకున్నారు. ఇక రెండో ట్రిప్‌లో ఐదు పడవల్లో వెళ్తుండగా రెండు పడవలు నీట మునిగాయి. పడవల్లోని 11మందిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా ఎనిమిది మంది గల్లంతయ్యారు. మృతులలో ఏడాది బాలుడు అభి, గాయత్రి(4), అనూ(23) మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కోందుగూడా గ్రామానికి చెందిన సుమారు 11 మంది గిరిజనులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తున్నారు.

ఇక్కడ లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోవడంతో స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నుంచి సోమవారం రాత్రికి సీలేరు చేరుకున్నారు. తమను వెళ్లకుండా ఎవ్వరైనా అడ్డుపడతారేమోనని భయంతో సీలేరు శివార్లలో గల చెక్‌పోస్ట్ వద్దకు చేరుకుని అర్ధరాత్రి వరకూ అక్కడే ఉన్నారు. చెక్‌పోస్టు వెనకభాగం నుంచి టేకుతోటల మీదుగా సీలేరు నది వద్దకు వెళ్లారు. అప్పటికే వారి గ్రామస్థులకు విషయం తెలియజేయడంతో వీరి ప్రయాణం కోసం రెండు నాటు పడవలను సిద్ధం చేసి ఉంచారు.రెండు నాటు పడవలు మీద 11 మంది బయలుదేరారు. నది మధ్యలోకి వెళ్లేసరికి ముందుగా వెళ్తున్న నాటుపడవ అదుపుతప్పి బోల్తాపడింది. రెండో నాటుపడవలో ఉన్నవారు నదిలో పడ్డవారిని రక్షించడానికి ప్రయత్నించగా ఆ పడవ కూడా మునిగిపోయింది. రెండు పడవల్లో ఉన్నవారిలో ముగ్గురు వ్యక్తులు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకుని స్వగ్రామానికి వెళ్లి విషయం తెలియజేశారు. సమాచారం అందుకున్న మల్కన్‌గిరి జిల్లా అధికారులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందిని ఘటనా స్థలికి పంపించారు. ఘటనా స్థలానికి సీలేరు ఎస్‌ఐలు రంజిత్, రమణలు, చిత్రకొండ పోలీసు అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

6 dead as 2 boats capsized in Sileru river in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News