Monday, December 23, 2024

భూ వివాదంలో ఘర్షణ .. ఆరుగురు హత్య

- Advertisement -
- Advertisement -

డియోరియా (యుపి) : ఉత్తరప్రదేశ్ లోని రుద్రపూర్ ఏరియా ఫతేపూర్ గ్రామంలో లెహ్‌డా టోలా ప్రాంతంలో సోమవారం ఉదయం భూ వివాదంపై చెలరేగిన హింసాత్మక ఘర్షణలో ఆరుగురు హత్యకు గురయ్యారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. మాజీ జిల్లా పంచాయతీ సభ్యుడు ప్రేమ్ యాదవ్ (50)పై ప్రత్యర్థి సత్యప్రకాష్ దూబే పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్యచేశాడు. ఆయనే కాకుండా ఆయన కుటుంబీకులపై కూడా దాడి జరిగింది. దీంతో యాదవ్‌కు చెందిన అభయ్‌పూర్ మద్దతుదారులు ప్రతీకారంతో దూబే ఇంటిపై దాడి చేసి దూబేతోపాటు ఆయన కుటుంబీకులు ఐదుగురిపై దాడి చేశారు. ఈ దాడిలొ దూబే (54), అతని భార్య కిరణ్ దూబే (52), కుమార్తెలు సలోని (18), నందిని (10), కుమారుడు గాంధీ (15) హత్యకు గురయ్యారు. దూబే ఎనిమిదేళ్ల కొడుకు అనుమోల్ తీవ్రంగా గాయపడగా, గోరఖ్‌పూర్ బీఆర్‌డి మెడికల్ కాలేజీకి చికిత్స కోసం తరలించారు.

ఆ బాలుని పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్టు స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. ఈ సంఘటన గురించి సోమవారం ఉదయం 8 గంటలకు తెలిసిందని జిల్లా మెజిస్ట్రేట్ అఖండ్ ప్రతాప్ సింగ్ చెప్పారు. రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగాసాగుతున్న భూ వివాదమే ఈ హత్యలకు దారి తీసిందని మెజిస్ట్రేట్ చెప్పారు. సత్యప్రకాష్ దూబే సాధు దూబే తన భూమిని ప్రేమ్‌చంద్ యాదవ్‌కు విక్రయించాడని, ఈ వివాదం ఏడేళ్ల క్రితమే పరిష్కారమైందని వివరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ హత్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌కు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News