- Advertisement -
పాట్నా: మద్యనిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి చెందిన సంఘటన బీహార్ రాష్ట్రం బక్సర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమ్సారీ ప్రాంతంలో కల్తీ మద్యం సేవించడంతో పది మంది తీవ్ర అసస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో ఆరుగురు మృతి చెందగా నలుగురు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని బక్సర్ ఎస్‌పి నీరజ్ కుమార్ సింగ్ తెలిపాడు. గతంలో సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. సంపూర్ణ మద్య నిషేధం ఉన్న రాష్ట్రంలోకి వైన్ బాటిల్స్ ఎక్కడ నుంచి వచ్చాయని పోలీసులు వాకబు చేస్తున్నారు. నాటు సారా తయారు చేసి వైన్ బాటిల్స్ నింపి అమ్ముతుండడంతోనే ఈ దారుణాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
- Advertisement -