Monday, December 23, 2024

సరిహద్దులు దాటిన డ్రగ్స్ డబ్బులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తులో మరింత లోతుకు వెళ్లడంతో షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. ఆఫ్రికాకు చెందిన నిందితుడి పేరుపై జరుగుతున్న డ్రగ్స్ దందాలో నిందితులు తీసుకున్న డబ్బులను దేశం దాటించినట్లు విచారణలో తెలిసింది. పెట్టుబడుల కేసులో కూడా నిందితులను ఇండియన్లను మోసం చేసి సేకరించిన డబ్బులను హవాలా ద్వారా విదేశాలకు తరలించారు. అలాగే డ్రగ్స్ దందాలో కూడా ఇలాగే చేశారు. హైదరాబాద్ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు కొంత కాలం క్రితం ముగ్గురు నైజీరియన్లు, ముగ్గురు ఇండియన్స్‌ను అరెస్టు చేశారు.

వారు 200మందికి డ్రగ్స్ విక్రయించినట్లు తెలిసింది, అందులో హైదరాబాద్‌లో 10శాతం మందికి బెంగళూరుకు చెందిన వారు 90శాతం మంది ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. డ్రగ్స్‌కు డిమాండ్ ఎక్కువ ఉండడంతో చాలా డబ్బులు సేకరించారు. డబ్బుల తరలింపుపై దృష్టి పెట్టిన పోలీసులు నిందితుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా దాదాపుగా రూ.4కోట్ల రూపాయలను విదేశాలకు తరలించినట్లు తెలిసింది. నైజీరియాకు చెందిన హెన్రీ పేరుతో ఉన్న 22బ్యాంక్ ఖాతాలకు డబ్బులను తరలించినట్లు విచారణలో బయటపడింది. దీంతో హైదరాబాద్ పోలీసులు హెన్రీని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు బెంగళూరులో చదువుకున్న సమయంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News