Monday, December 23, 2024

విద్యార్థులతో లైంగిక చర్యలు.. ఆరుగురు మహిళా టీచర్లు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన టీచర్లే వారితో లైంగిక కార్యకలాపాలు సాగించడం విస్మయం కలిగిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఆరుగురు టీచర్లు ఈ నేరాలపై అరెస్టు అయ్యారు. కాలిఫోర్నియాలోని దానివిల్లే పట్ణణానికి చెందిన ఎలెన్ షెల్ (38), ఇద్దరు 16 ఏళ్ల యువకులతో లైంగిక చర్యలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆర్కనాస్ రాష్ట్రానికి చెందిన హెథర్ హరే (32) అనే మహిళా టీచర్ టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్టు కేసు నమోదయ్యింది. ఒక్లహామాకు చెందిన ఎమిలీ హాన్‌కాక్(26), లిన్‌కాల్న్ కౌంటీలోని టీచర్ ఎమ్మాడిలానే, అయోవా రాష్ట్రంలోని దేస్ మొయిన్స్ టీనేజి విద్యార్థులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.

దీనికి సంబంధించిన దృశ్యాలు, సీసీటీవీల్లోనూ రికార్డు అయినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. వర్జీనియాలోని హైస్కూల్‌లో 33 ఏళ్ల మహిళా టీచర్ చాలా నెలలుగా ఓ విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తిస్తోందనే ఆరోపణలపై కేసు దాఖలైంది. వీటితోపాటు పెన్సిల్వేనియాకు చెందిన జావెలిన్ కోచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇలా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో విద్యార్ధులతో మహిళా టీచర్లు లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించి రెండు రోజుల్లోనే ఆరు కేసులు నమోదైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News