Monday, December 23, 2024

ఈ వారం 6 ఐపిఒలు

- Advertisement -
- Advertisement -

ఈ వారం ఐపిఒల లక్షం రూ.3,000 కోట్ల సమీకరణ
స్టాక్‌మార్కెట్లో 5 షేర్ల లిస్టింగ్

న్యూఢిల్లీ : ఈ వారం కూడా స్టాక్ మార్కెట్‌లో ఐపిఒ సందడి కొనసాగనుంది. ఎందుకంటే ఈ వారంలో ఆరు కొత్త ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)లు మార్కెట్లోకి రానున్నాయి. ఇంకా 5 కొత్త షేర్లు మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. వారం రోజుల్లో ఈ ఐపిఒ ద్వారా కంపెనీలు దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా సమీకరించనున్నాయి. ఫిబ్రవరి 26 నుండి ప్రారంభమయ్యే వారంలో 3 ఐపిఒలు ఉంటాయి. వాటిలో ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికామ్ టెలి సిస్టమ్స్, భారత్ హైవేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఐపిఒలు ఉన్నాయి. ఈ మూడు ఐపిఒల మొత్తం పరిమాణం రూ.3 వేల కోట్లకు పైగా ఉంది. కాగా ఎస్‌ఎంఎఇ విభాగంలో ఫ్లెక్సీప్యాక్, ఓవైస్ మెటల్, మినరల్ ప్రాసెసింగ్, ఎంవికె ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్‌ల ఐపిఒలు రానున్నాయి.

జికాల్ టెలి సిస్టమ్స్ ఐపిఒ
జికాల్ టెలి సిస్టమ్స్ ఐపిఒ విలువ రూ. 429 కోట్లు ఉంటుంది. ఈ ఐపిఒ ఫిబ్రవరి 27న ప్రారంభమై, 29వ తేదీన ముగుస్తుంది. ఐపిఒలో రూ. 329 కోట్ల విలువైన షేర్ల తాజా ఇష్యూ, 70.42 లక్షల షేర్ల విక్రయానికి ఆఫర్ ఉన్నాయి. ఈ ఐపిఒ ధర బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.135 నుంచి రూ.142గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 100 షేర్లు ఉంటాయి.

ప్లాటినం ఇండస్ట్రీస్ ఐపిఒ
ప్లాటినం ఇండస్ట్రీస్ ఐపిఒ ఫిబ్రవరి 27న ప్రారంభమై, ఫిబ్రవరి 29న ముగుస్తుంది. రూ.235 కోట్ల ఈ ఐపిఒ పూర్తిగా తాజా ఈక్విటీ ఇష్యూ, దీని ధర రూ. 162- నుంచి 171గా ఉంది. వారంలో అతిపెద్ద ఐపిఒ భారత్ హైవేస్ ఇన్విట్, దీని పరిమాణం రూ. 2,500 కోట్లుగా ఉంది. ఐపిఒ ఫిబ్రవరి 28న ప్రారంభమై మార్చి 1న ముగుస్తుంది. ఐపిఒ ధర బ్యాండ్ రూ. 98-100గా నిర్ణయించారు.

ఈ ఐదు షేర్ల లిస్ట్
ఎస్‌ఎంఇ విభాగంలో ఒవైస్ మెటల్ రూ.40 కోట్ల ఐపిఒ ఫిబ్రవరి 26న ప్రారంభం కానుంది. ఫ్లెక్సీప్యాక్ ఐపిఒ ఫిబ్రవరి 27న తెరవబడుతుంది. దీని పరిమాణం కూడా రూ.40 కోట్లుగా ఉంది. రూ.66 కోట్ల విలువైన ఎంవికె ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్ ఐపిఒ ఫిబ్రవరి 29న ప్రారంభమవుతుంది. జూనిపర్ హోటల్స్, జిపిటి హెల్త్‌కేర్, డీమ్ రోల్ టెక్, జెనిత్ డ్రగ్స్, సాధవ్ షిప్పింగ్ షేర్లు వారంలో లిస్ట్ కానున్నాయి.

ఎన్నికలు, ఇతర అంశాల ప్రభావం
ఈ వారం మార్కెట్‌పై నిపుణులు
పస్తుత దేశీయ స్టాక్‌మార్కెట్లలో సానుకూల వాతావరణం ఉంది. అయితే రానున్న రోజుల్లో మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. మార్కెట్‌ను ప్రభావితం చేసే అనేక అంశాలు కొత్త వారంలో ఆధిపత్యం చెలాయిస్తాయి. గత వారం సెన్సెక్స్ 15.45 పాయింట్లు (0.021 శాతం) స్వల్పంగా పడిపోయి 73,142.80 పాయింట్ల వద్ద ముగిసింది. కొత్త వారంలో ఎన్నికల ప్రభావం మార్కెట్‌లో కనిపించడం ప్రారంభించవచ్చు. మరో ఒకటి రెండు నెలల తర్వాత దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగవచ్చు.

అంతకుముందే ఎన్నికల వాతావరణం నెలకొనడంతో పొత్తుల మధ్య సీట్ల పంపకాలు మొదలయ్యాయి. ఆర్థిక డేటా పరంగా ఈ వారం ముఖ్యమైంది. మూడో త్రైమాసికానికి సంబంధించిన జిడిపి గణాంకాలు ఫిబ్రవరి 29న రానున్నాయి. వారం చివరి రోజైన మార్చి 1న వాహన కంపెనీలు విక్రయ గణాంకాలను విడుదల కానున్నాయి. ఎఫ్ అండ్ ఒ గడువు, ఎంఎస్‌సిఐ ఇండెక్స్, 6 కొత్త ఐపిఒలు కూడా ప్రభావం చూపుతాయి. విదేశీ పెట్టుబడిదారులు గత వారం ఐదు సెషన్లలో 3 సెషన్లలో నికర విక్రేతలుగానే ఉన్నారు. మొత్తం వారంలో ఎఫ్‌పిఐలు దాదాపు రూ.2 వేల కోట్లను విక్రయించాయి. డాలర్, ముడి చమురు భవిష్యత్ ట్రెండ్ కూడా మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News