- Advertisement -
హైదరాబాద్: ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో నల్గొండ జిల్లా కేతేపల్లిలోని మూసి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. 645 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం ఉండగా ప్రస్తుతం 638.30 అడుగులకు నీరు చేరుకుంది. ఇన్ ఫ్లో 3800 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3200 క్యూసెక్కులగా ఉందని అధికారులు వెల్లడించారు. ఇక మూసి గేట్లు తెరుచుకున్నాయని సమాచారం తెలియడంతో పర్యాటకులు తరలి వచ్చి మూసి పరవళ్లను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
- Advertisement -