Monday, January 27, 2025

ఆరుగురు జల సమాధి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నారాయణపేట/శ్రీరంగాపురం: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఆరుగురు బాలికలు మృతి చెందిన సంఘటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం విషాదం నింపింది. పోలీసులు, స్థానికల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా
మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన రాధిక (19), నర్వ మండలం పాతర్ చెడ్ గ్రామానికి చెందిన శ్రావణి (14), మహి (12) విద్యార్థులు సరదాగా రాకొండ గ్రామ శివారులోని చెక్ డ్యాంలో ఈతకు వెళ్లి ప్రమాదశాత్తు చెక్ డ్యాంలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

అదే విధంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల పరిధిలోని తాటిపాముల గ్రామానికి చెందిన గంధం కురుమన్న కుమార్తెలు గంధం తిరుపతమ్మ(16), గంధం సంధ్య(12), గంధం దీపిక (10)లు సోమవారం మధ్యాహ్నం గ్రామంలోని వీరసముద్రం చెరువులోకి బట్టలు ఉతి కేందుకు వెళ్లారు. ప్రమాదావశాత్తు ఒకరి తర్వాత మరొకరు చెరువు గుంతలో జారిపడ్డారు. నీటిలో మునిగిన చిన్నారుల అరుపులు గమనించిన స్థానిక యువకులు వారికి బయటకు తీయగా అప్పటికే వారు మృతి చెంది ఉన్నారని తెలిపారు. చిన్నారుల తండ్రి గంధం కురుమన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చిన్నారుల మృతితో తాటిపాముల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News