Monday, January 20, 2025

రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసి బస్సు..

- Advertisement -
- Advertisement -

6 Injured in Road Accident in Prakasam District

అమరావతి: ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మండలంలోని హసనాపురం వద్ద అనంతపురం నుండి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

6 Injured in Road Accident in Prakasam District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News