Wednesday, April 2, 2025

జమ్ముకశ్మీర్ లో పేలుడు… ఆరుగురు సైనికులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

జమ్ముకశ్మీర్ లో పేలుడు సంభవించింది. రాజౌరీ జిల్లా నౌషేరాలో భవానీ సెక్టార్‌, మక్రి ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ఆరుగురు భారత ఆర్మీ సైనికులు గాయపడ్డారు. సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. జవాన్లు తమ సాధారణ గస్తీని నిర్వహిస్తుండగా, సైనికులల్లో ఒకరు ప్రమాదవశాత్తూ గనిపై కాలు పెట్టడంతో పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా మొత్తం ఆరుగురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారికి వెంటనే వైద్య కోసం రాజౌరిలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News