Friday, December 27, 2024

ఒడిశాలో గూడ్స్ రైలు బోగీలు కదిలి ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఝాజ్‌పూర్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం మరపు రాకముందే మరో రైలు ప్రమాదం ఝాజ్‌పూర్ స్టేషన్‌లో జరిగింది. ఈ స్టేషన్‌లో కొంతకాలంగా ఇంజిన్ లేని గూడ్స్ రైలు నిలిపి ఉంది. బుధవారం ఈదురు గాలులకు గూడ్స్‌రైలు బోగీలు కదలడంతో దానికింద ఉన్న ఆరుగురు కూలీలు మరణించిన సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఝాజ్‌పూర్ రోడ్ స్టేషన్ వద్ద కొందరు కార్మికులు పట్టాల మరమ్మతు పనులు చేస్తున్నారు. ఉన్నట్టుండి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో కూలీలు పని ఆపేసి వర్షంలో తడవకుండా ఉండడానికి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలు కిందకు వెళ్లారు. బలంగా వీచిన గాలులకు గూడ్స్ రైలు వ్యాగన్లు ముందుకు కదిలాయి.

దీంతో గూడ్స్ కింద ఉన్న కూలీలు వ్యాగన్ల చక్రాల కింద నలిగిపోయారు. నలుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరుతీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చనిపోయారు. మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందగానే పోలీస్‌లు అక్కడికి చేరుకుని ఎలాంటి ఉద్రిక్తతలు ఆ ప్రాంతంలో తలెత్తకుండా చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News