Monday, December 23, 2024

కాలిఫోర్నియాలో కాల్పులు.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

సాక్రామోంటో: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. కనీసం తొమ్మండుగురు గాయపడ్డారు. కాలిఫోర్నియా రాజధాని సాక్రామోంటో డౌన్‌టౌన్ ఏరియాలో ఈ కాల్పుల ఘటన జరిగిందని పోలీసు విభాగం నిర్థారించింది. స్థానిక కాల్పులు జరగడంతో జనం పరుగులు తీశారు. ఆగంతకులు కొద్ది సేపటివరకూ ఆగకుండా కాల్పులకు దిగినట్లు ఈ క్రమంలో అనేకులు గాయపడటం, మరణించడం జరిగినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కొందరు టెన్త్ అండ్ జె స్ట్రీట్స్‌లో ఆగంతకులు దారుణానికి ఒడిగట్టారు. ప్రజలు ప్రాణభీతితో తల్లడిల్లుతూ ఉండటం, ఏమి జరుగుతుందో తెలియని స్థితిని తెలిపే వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఘటన వివరాలను సంక్షిప్తంగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.

6 Killed after shooting in California

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News