Sunday, January 19, 2025

దుకాణంలో మంటలు.. ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

ఫిరోజాబాద్: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఒక ఎలెక్ట్రానిక్స్ ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు. మృతులలో ఒక చిన్నారి కూడా ఉంది. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫర్నీచర్ దుకాణం ఉండగా మొదటి, రెండు, మూడు అంతస్తులలో కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. మంగళవారం రాత్రి దుకాణంలో మంటలు చెలరేగి అవి భవనంలోని మిగతా అంతస్లుకు పాకాయని పోలీసులు తెలిపారు. మంటల్లో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారని పోలీసులు తెలిపారు.

పోస్టు మార్టం అనంతరం వారి మృతదేహాలకు బుధవారం అంత్యక్రియలు జరిగాయి. ఫర్నీచర్ షాపులో బ్యాటరీ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు చెప్పారు. ఫర్నీచర్ దుకాణం యజమాని, ఆయన కుమారుడు, కుమార్తె మంటల నుంచి తప్పించుకున్నారని వారు చెప్పారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

6 Killed as fire breaks out at Furniture Shop in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News