Wednesday, January 22, 2025

గుజరాత్‌లో విషవాయువు పీల్చి ఆరుగురు కార్మికుల మృతి..

- Advertisement -
- Advertisement -

6 killed as inhaling toxic gas in Surat

సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం ఉదయం ఒక డైయింగ్ ఫ్యాక్టరీ సమీపంలో నిలిపి ఉన్న రసాయనాల ట్యాంకర్ నుంచి వెలువడిన విషవాయువు పీల్చి ఆరుగురు కార్మికులు మరణించగా మరో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. పచిన్ పారిశ్రామిక వాడలోని ఒక డయింగ్ ఫ్యాక్టీలో పనిచేస్తున్న కార్మికులు విషవాయువు పీల్చినట్లు సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరీక్ తెలిపారు.

రసయనాల ట్యాంకర్ నుంచి వెలువడిన విష వాయువు పీల్చి 25, 26 మంది కార్మికులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెల్లవారుజామున 4.25 గంటలకు తమకు ఫోన్ వచ్చిందని, వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఆయన చెప్పారు. అనంతరం&అగ్నిమాపక సిబ్బంది ట్యాంకర్ వాల్వ్‌ను కట్టేసి లీకేజీని అరికట్టారని ఆయన తెలిపారు.

6 killed as inhaling toxic gas in Surat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News