Wednesday, January 22, 2025

బీహార్‌లో పెళ్లి షామియానాకు మంటలు.. మూడు ఆవులు మృతి

- Advertisement -
- Advertisement -

ముగ్గురు పిల్లలతోసహా ఆరుగురి మృతి

పాట్నా: బీహార్‌లోని దర్భంగ జిల్లాలో ఒక వివాహ వేడుకల్లో మంటలు చెలరేగి ముగ్గురు పిల్లలతోసహా ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మూడు ఆవులు కూడా మరణించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. నగరంలోని బహేరా ప్రాంతంలోని అలీనగర్‌లో గురువారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో ఈ విషా ఘటన చోటుచేసుకున్నట్లు వారు తెలిపారు. బాణసంచా కాల్చిన సందర్భంగా షామియానాకు మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శకటాలు అక్కడకు వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చాయని దర్భంగ ఎస్‌ఎస్‌పి జగునాథ్ రెడ్డి తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం జిల్లలా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. మంటలు వేగంగా వ్యాపించడానికి దారితీసిన కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. టపెంటులో ఏవైనా త్వరగా మండే వస్తువులు ఉండవచ్చన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. మృతులలో 3, 4, 5 సంంవత్సరాల పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News