Sunday, January 19, 2025

హెలికాప్టర్ కూలిపోయి ఆరుగురు పాక్ సైనికాధికారుల మృతి

- Advertisement -
- Advertisement -

6 Killed in Helicopter Collapsed in Pakistan

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో పాక్‌కు చెందిన ఒక ఉన్నతస్థాయికి చెందిన సైనిక జనరల్‌తోపాటు ఐదుగురు సీనియర్ సైనికాధికారులు మరణించారు. మరణించిన వారిలో కమాండర్ 12 కోర్ లెఫ్టినెంట్ జనరల్ సర్ఫ్రాజ్ అలీ ఉన్నట్లు సైన్యం తెలిపింది. బలూచిస్తాన్ ప్రావిన్సులో వరద సహాయక కార్యకలాపలను ఆయన పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రతికూల వాతావరణమే సోమవారం సాయంత్రం హెలికాప్టర్ కూలిపోవడానికి కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు సనికాధికారి ఒకరు తెలిపారు. సోమవారం సాయంత్రం 5.10 గంటలకు ఉత్తల్ నుంచి బయల్దేరిన హెలికాప్టర్ సాయంత్రం 6.05 గంటలకు కరాచీలో దిగాల్సి ఉండగా మధ్యలోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికారి చెప్పారు.

6 Killed in Helicopter Collapsed in Pakistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News