మనతెలంగాణ/మాదాపూర్: బ్రతుకుదెరువు నిమిత్తం పోట్టచేత పట్టుకొని నగరంకు వలస వచ్చి మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్‌ప్లాట్స్ కాలనీ నివాసం ఉంటు కుటుంబాని పోషించుకుంటున్న వ్యక్తి పనిచేస్తున్న చోటనే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గోకుల్‌ప్లాట్స్ కాలనీ అధ్యక్షులు సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లాకు చెందిన బి. మోహన్ (33) గత 10 సంవత్సరాల క్రితం గోకుల్‌ప్లాట్స్ కాలనీకి వలస వచ్చి కూలి పనులు చేస్తు కుటుంబాని పోషించుకుంటున్నాడు. కాగ గత 20 రోజుల క్రితం గోపాల్‌నగర్ కాలనీలో పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
మృతి చెందిన మోహన్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మోహన్ భార్య అంజలికి నష్టపరిహరం కింద 6లక్షల రూపాయలను ఇప్పించడం జరిగిందన్నారు. ఎక్కడైతే పనిచేస్తున్నడో అక్కడి ఇంటి వారు మోహన్ కుటుంబానికి అతని భార్య అంజలికి గురువారం గోకుల్‌ప్లాట్స్ కాలనీ అధ్యక్షులు సాంబయ్య చేతుల మీదుగా 6లక్షల రూపాయలను అందజేశారు. మానవత్వంతో మృతి చెందిన మోహన్ కుటుంబానికి నష్టపరిహరం అందించడంలో కాలనీ అధ్యక్షులు సాంబయ్య కృషి మరువలేనిదని అంజలి అన్నారు.