Thursday, December 19, 2024

తెలంగాణ వచ్చాక 6 లక్షల ఐటి ఉద్యోగాలు వచ్చాయి

- Advertisement -
- Advertisement -

ఐటి రంగం అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోంది
గత ఏడాది రూ.57 వేల కోట్లకు ఐటి ఎగుమతులు
అసెంబ్లీలో మంత్రి కెటిఆర్ వెల్లడి

హైదరాబాద్ : ఐటి రంగంలో 27ఏళ్లలో వచ్చిన అభివృద్దిని తాము ఒక్క ఏడాదిలోనే సాధించి చూపామని రాష్ట్ర ఐటి పరిశ్రమలు పురపాకల శాఖల మంత్రి కె.టి.రామారావు వెల్లడించారు.తెలంగాణనుంచి ఐటి ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరుగూ వస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటిఆర్ బదులిచ్చారు. స్థిరమైన ప్రభుత్వం సమర్ధవంతమైన నాయకత్వం దక్షతగల దమ్మున్న నాయకుడు కేసిఆర్ ఉండటం వల్లే ఐటి పరిశ్రమ అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. దేశంలో ఉన్న ఐటి పురోగతితో పోలిస్తే మన ఐటి రంగం పురోగతి నాలుగు రెట్లు ఎక్కువగా ఉందదన్నారు.“హైదరాబాదద్‌లో ఐటీని తామే అభివృద్ధి చేశామని కొంతమంది చెప్పుకుంటారు. కానీ మేం అలా చెప్పుకోం. హైదరాబాద్‌లో 1987లోనే తొలిసారిగా ఐటీ కంపెనీ ప్రారంభమైంది.

బేగంపేటలోని ఇంటర్‌గ్రాఫ్ సంస్థ .అది మొట్టమొదటి ఐటీ భవనం. 1987నుంచి 27 ఏళ్లలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ. 56 వేల కోట్లు ఉంటే, ఒక్క గత ఏడాదే రూ. 57 వేల కోట్లు ఉన్నాయి. నిన్న కోకాపేట భూములకు వేలం నిర్వహిస్తే ఎకరం భూమి ధర రూ. 100 కోట్లు పలికింది. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆ కుంభకోణం అని ఈ లంబకోనం అని , ధరణిలో ఏమో మోసం జరిగిపోయిందని పనికిమాలిన మాటలు మాట్లాడుతూన్నారు. కానీ ఇవాళ అన్ని రికార్డులు బద్దలు కొడుతూ , అన్ని అనుమానాలను చెరిపేస్తూ ఒక్కొక్క ఎకరం రూ. 100 కోట్లు పలికే పరిస్థితి వచ్చింది.  ఊరికేనే డైలాగులు కొడితేనో, బయటకు పోయి ధర్నాలు చేస్తేనో ఇలాంటివి జరగవు. రాష్ట్రంలో అధ్భుతమైన పురోగతి జరుగుతోంది. దీనికి రెండు కీలకమైన అంశాలు అవసరం. అవి స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్‌షిప్.

రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండి, దక్షత కలిగిన , దమ్మున్న నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే రాష్ట్రం పురగోతిలో వుంది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష. ఇవాళ హర్యానాలో ఏమవుతుంది, గురుగ్రామ్ గొప్ప ఐటీ సెంటర్ … దాన్ని అక్కడున్నవారు నాశనం చేవారు.అక్కడ కూడా పనికి మాలిన మతం పేరు మీద పంచాయతీలు పెట్టి.. గబ్బులేపి , ఉన్నవారిని పారిపోయే విధంగా దరిద్రపు కార్యక్రమాలు చేస్తున్నారు. మణిపూర్‌లో ఏం జరుగుతోంది. మతాల పేరు మంటలు సృష్టిస్తున్నారు దేశంలోని ఐటీ పురోగతి కంటే.. మన రాష్ట్రంలోని ఐటీ పురోగతి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. దీనికి కారణం స్టేబుల్ గవర్నమెంట్..ఏబుల్ లీడర్‌షిప్ మాత్రమే” అని కెటిఆర్ మరో మారు స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రం వచ్చాక 6లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి పరిశ్రమ విస్తరిస్తోందన్నారు. ఇప్పటికే చాలా నగరాల్లో ఐటి కంపెనీలు ప్రాంరభమయ్యాయని తెలిపారు. పట్టణాలు , నగరాలు ఎదగాలంటే పరిశ్రమలను ఆకర్షించాలన్నారు. ప్రతిచోటా అంతర్జాతీయ ప్రమాణాలను తట్టుకుని నిలబడాలన్నారు. దేశంలో మొత్తం సృష్టించిన టెక్నాలజీ జాబ్స్‌లో 44శాతం తెలంగాణలోనివే అని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News