Monday, December 23, 2024

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

6 members Interstate gang arrested

ఆరుగురు నిందితుల అరెస్టు
43.25 తులాల బంగారు ఆభరణాలు, 27తులాల వెండి, రూ.4,13,000 నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన నార్త్‌జోన్ డిసిపి చందనాదీప్తి

మనతెలంగాణ, హైదరాబాద్ : బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని బ్యాగుల్లోని బంగారు ఆభరణాలు, డబ్బులు చోరీ చేస్తున్న అంతరాష్ట్రముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 43.25 తులాల బంగారు ఆభరణాలు, 27తులాల వెండి, రూ.4,13,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డిసిపి చందనాదీప్తి తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, అలీఘర్ జిల్లా, కోయిల్ తాలుకా, కమలాపూర్ గ్రామానికి చెందిన ఇషాక్, హత్రాస్ జిల్లా, ఇగ్లాస్ పిఎస్, మహిపురా గ్రామానికి చెందిన ఎండి గుల్‌షెడ్, ఎండి జునెద్ అలాం, అబ్దుల్ అన్సార్ అలీ, రియాసాద్, బాబుల్ అహ్మద్ దుస్తుల వ్యాపారం చేస్తున్నారు.

ఆరుగురు నిందితులు కలిసి తెలంగాణలో ని వివిధ ప్రాంతాల్లోని తిరుగుతూ దుస్తులు విక్రయిస్తున్నట్లు నటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఆర్టిసీ, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి బ్యాగుల జిప్‌లను తీసి వాటిలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులను దోచుకుంటున్నారు. ఆరుగురు నిందితుల అంతరాష్ట్ర ముఠా నగరంలో తిరుగుతుండా గోపాలపురం పోలీసులు పట్టుకున్నారు. ముఠా నాయకుడు మిగతా వారిని తీసుకుని వచ్చి వారికి రూ.2,000, రూ.5,000 ఇచ్చేవాడు. చోరీలు చేసిన తర్వాత నిందితులు సమీపంలోని లాడ్జిలు, హోటళ్లలో బస చేసేవారు. ఇన్స్‌స్పెక్టర్ సాయిఈశ్వర్ రావు, డిఐ కోటయ్య, ఎస్సై పాండు రాజు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News