Friday, December 27, 2024

యూపీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు నేపాలీయులు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రావస్తి ( యుపి): ఉత్తరప్రదేశ్ శ్రావస్తి జిల్లాలో ఎకోనా ప్రాంతంలో అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు నేపాలీయులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ రోడ్డుపై పశువుల మందను తప్పించడానికి ప్రయత్నించడంతో కారు చెట్టుకు ఢీకొట్టి రోడ్డు పక్కనున్న మురుగు కాలువలో పడిపోయింది. మృతులు నీలాంష్ (36), నీతి (20), దీపిక (35), వైభవ్ అలియాస్ సోను ( 36),గా గుర్తించారు. పిల్లలను ఇంకా గుర్తించ వలసి ఉంది. వీరంతా నేపాల్ లోని నేపాల్‌గంజ్ సిటీ త్రిభువన్ చౌక్ ఏరియాకు చెందిన వారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో బహ్రయిచ్ మెడికల్ కాలేజీలో వైద్య చికిత్సకు చేర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News