Wednesday, January 22, 2025

రాష్ట్ర శాసన మండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌ నుంచి ఒకే ఒక్కరు…

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర శాసన మండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలుగా ఏర్పడనున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో పాటు గవర్నర్ కోటాలో రెండు పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో భర్తీ కానున్నాయి. మహబూబ్‌గర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి (హుజూరాబాద్) నుంచి, కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్) నుంచి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా 2027 మార్చి వరకు పదవీకాలం ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరి స్థానంలో నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి.

28 మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు
అయితే ఇప్పుడు శాసనమండలి అంశం ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా శాసనమండలిలో ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీల రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే తప్ప 2025 వరకు ఇతర ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం కూడా లేదు. మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా బిఆర్‌ఎస్‌కు 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ నామినేటెడ్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మండలిలో మజ్లిస్‌కు ఇద్దరు సభ్యులు, బిజెపికి ఒక సభ్యుడు, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. దీంతో మండలి సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను మాత్రం త్వరలోనే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో శాసనమండలి కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారనుంది. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండలి సభానాయకుడు అయ్యే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News