Sunday, January 19, 2025

నీలోఫర్ ఆస్పత్రిలో 6 నెలల చిన్నారి అదృశ్యం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారి అదృశ్యమైంది. ఓ మహిళ, ఎత్తుకుంటానని చెప్పి తల్లి నుంచి చిన్నారిని తీసుకుంది. దీంతో చిన్నారి తల్లి వార్డు లోపలికి వెళ్లి వచ్చేసరికి చిన్నారితోపాటు మహిళ కూడా కనిపించకపోవడంతో ఆస్పత్రి మొత్తం వెతికింది. చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు గ్రహించిన తల్లిదండ్రులు వెంటనే నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిసి కెమెరాల ఆధారంగా మహిళను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News