Wednesday, January 22, 2025

తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాష్, ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఇ శ్రీధర్, ఇంటర్‌ విద్య డైరెక్టర్‌గా శృతిఓజా, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఈవీ నర్సింహారెడ్డి, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి డీఎస్‌ చౌహాన్‌ లను ప్రభుత్వం నియమించగా.. రంగారెడ్డి కలెక్టర్‌గా గౌతమ్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న భారతి హోలికేరిపై వేటు వేసింది. ఆమెకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్టు చేయాలని సీఎస్, ఆమెను ఆదేశించారు.

కాగా, తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీగా ఐఏఎస్, ఐపిఎస్ లను బదిలీ చేసింది. చాలా కాలంగా ఒకేచోట పనిచేసిన అధికారులను బదిలీ చేయడంతోపాటు పలువురి అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News