Thursday, December 26, 2024

ఛత్తీస్‌గఢ్ సుక్మాలో ఎన్‌కౌంటర్..ఆరుగురు నక్సలైట్ల మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌కు, భద్రతా బలగాలకు మధ్య శనివారం భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో చాలా సేపటివరకూ జరిగిన ఈ ఘటనలో కనీసం నలుగురు లేదా ఆరుగురు నక్సలైట్లు చనిపోవడం లేదా గాయపడటం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే ఘటనాస్థలితో భౌతికకాయాలు కనుగొనలేదు. దీనితో నక్సలైట్లు ఎందరు చనిపొయ్యారనేది నిర్థారణ కాలేదు.

అయితే ఎన్‌కౌంటర్‌లో దెబ్బతిన్న తమవారిని నక్సలైట్లు అడవుల్లో సురక్షిత ప్రాంతానికి తరలించి ఉంటారని అధికారులు తెలిపారు. మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉండే చింతాగుఫా, కిష్టారం పోలీసు స్టేషన్ పరిధి మధ్యలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిసింది. నక్సలైట్ల గాలింపు చర్యలలో భాగంగా భద్రతాబలగాలు వెళ్లిన దశలో పరస్పర కాల్పులు జరిగినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News