Thursday, December 26, 2024

విషాద ఘటన.. ఒకే కుటుంబంలో ఆరుగురు అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతుల్లో నలుగురు పిల్లలు ఉన్నారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోగుండా పట్టణానికి చెందిన పప్పు గామేటి, 27 ఏళ్ల భార్య దుర్గా, వారి నలుగురు పిల్లలతో కలిసి తన సోదరుల ఇళ్లకు సమీపంలోని ఇంటిలో ఉంటున్నారు. సోమవారం ఎంతసేపటికి వారి ఇంటి తలుపు తెరవకపోవడంతో పప్పు సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా పప్పు గామేటి, ముగ్గురు పిల్లలు సీలింగ్‌కు వేలాడుతూ చనిపోయి కనిపించారు.

భార్య దుర్గా, మరో చిన్నారి నేలపై విగత జీవులుగా పడి ఉన్నారు. భార్యశరీరంపై గాయాలున్నట్టు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే కుటుంబం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ యజమాని పప్పు తొలుత తన భార్య, చిన్నారిని గొంతునులిమి హత్య చేసిన తరవాత ముగ్గురు పిల్లలను సీలింగ్‌కు వేలాడ దీసి చంపి చివరకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్కాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడు గుజరాత్‌లో పనిచేసేవాడని, బస్సులో పళ్లు అమ్మేవాడని పోలీసులు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News