Sunday, December 22, 2024

గుజరాత్ తీరంలో ఆరుగురు పాకిస్తానీల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

గుజరాత్ తీరం సమీపాన పట్టివేత

పోర్బందర్ : రూ. 400 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న ఒక పడవలో నుంచి ఆరుగురు పాకిస్తానీలను గుజరాత్ పోర్బందర్ సమీపంలో అరెస్టు చేసినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. తమకు అందిన ఒక కూపీ ఆధారంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), భారతీయ కోస్ట్‌గార్డ్, గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్) సోమవారం రాత్రి భారత భూభాగంలోకి ప్రవేశించబోయిన పాకిస్తానీయులను అరెస్టు చేశారు. గుజరాత్‌ఎటిఎస్ సమాచారం ప్రకారం, ఒక భారతీయ పదవను ఉపయోగించుకుని ఢిల్లీ, పంజాబ్‌లకు నిషిద్ధ మాదకద్రవ్యాలను అక్రమంగా చేరవేయడానికి ఆ ఆరుగురు వ్యక్తులు ప్రయత్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News