Sunday, December 22, 2024

చాంద్రాయణగుట్టలో చోరీకి గురైన 6 బైక్‌లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముగ్గురు ద్విచక్రవాహన దొంగలను చాంద్రాయణగుట్ట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో దొంగిలించిన ఆరు ద్విచక్రవాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులు మహ్మద్ అజీజ్, మెహ్రాజ్ షరీఫ్, మహ్మద్ జానీలు ముఠాగా ఏర్పడి రాత్రి సమయంలో బైకుల చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దొంగతనాలకు పాల్పడి వాహనాలను తక్కువ ధరకు విక్రయించి డబ్బు సంపాదించారని వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News