- Advertisement -
హైదరాబాద్ లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. ఆదివారం ఉదయం మాధాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా నిర్మించిన ఆరంతస్తు భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. పలుమార్లు అధికారులు హెచ్చరించినా పట్టించుకోని బిల్డర్.. సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన చేపట్టారు. ఇప్పటికే 90 శాతం భవన నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశం బిల్డింగ్ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. కాగా, ప్రతి సోమవారం హైదరాబాద్ నగరవాసుల నుంచి ఫిర్యాదులు, సూచనలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు.
- Advertisement -