Wednesday, November 6, 2024

సిక్కింలో భారీ హిమపాతం: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -
50 మంది గల్లంతు!

గ్యాంగ్ టక్:  సిక్కింలో మంగళవారం హిమపాతం, కొండచరియలు విరిగిపడ్డం కారణంగా కనీసం ఆరుగురు పర్యాటకులు మరణించారని, 50 మంది గల్లంతయ్యారని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. భారత చైనా సరిహద్దు వద్ద నాథులా పాస్‌కు వెళ్లే దారిలో ఈ ఘటన జరిగింది. సిక్కిం పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సోనమ్ టెన్జింగ్ భూటియా మాట్లాడుతూ ‘మరణించిన వారిలో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఓ చిన్నారి ఉన్నారు. వారిని ఇంకా గుర్తించలేదు’ అన్నారు.

మధ్యాహ్నం 3.00 గంటల వరకు కనీసం 50 మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నారు. సైన్యం, రాష్ట్ర పోలీసులు, స్థానిక వాలంటీర్లు వారిని రక్షించడానికి అక్కడికి చేరుకున్నారు.సిక్కింలో మార్చి నుంచి నిరాటంకంగా మంచుకురుస్తోంది. నాథులా పాస్‌కు దారితీసే జెఎన్ రోడ్‌లోని 13వ మైలు వరకు పర్యాటకుల రాకపోకలను పరిమితం చేశారు.

సిక్కిం ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ, పర్యాటకులు 13వ మైలు రాయి వరకు వెళ్లేందుకు అనుమతించినప్పటికీ, హిమపాతం తాకినప్పుడు చాలా మంది 15వ మైలు రాయి వరకు కూడా వెళ్లలేరని అన్నారు. దాదాపు 80 మంది పర్యాటకులు హిమపాతం బారిన పడ్డారని తెలుస్తోంది. వారిలో 30 మందిని మధ్యాహ్నం 3.00 గంటల వరకు రక్షించి రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News