Thursday, January 23, 2025

బ్రిటన్ ప్రధాని జాన్సన్‌కు బిగ్ షాక్

- Advertisement -
- Advertisement -

6 UK Minister resign from  PM Johnson's Cabinet

బ్రిటన్ ప్రధాని జాన్సన్‌కు మరింత షాక్
మొత్తం ఆరుగురు మంత్రుల రాజీనామా
సొంత పార్టీ ఎంపీల నుంచి అసమ్మతి
పార్లమెంట్‌లో ఎదురుగాలితో ఉక్కిరిబిక్కిరి
వైదొలిగేది లేదని తేల్చిన బోరిస్
లండన్: బ్రిటన్‌లో మొత్తం ఆరుగురు మంత్రులు పదవులకు రాజీనామాలు చేశారు. ఈ పరిణామంతో ప్రధాని బోరిస్ జాన్సన్ నాయకత్వంలోని ప్రభుత్వం బుధవారం మరింత సంక్షోభంలో పడింది. జాన్సన్ కేబినెట్ నుంచి బుధవారంనలుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీనితో ఓ వైపు పార్లమెంట్‌లో ప్రతిపక్షం నుంచి తీవ్రస్థాయి విమర్శలు ఎదుర్కొంటున్న దశలోనే జాన్సన్‌కు స్వపక్షం నుంచి తలెత్తిన అసమ్మతి చివరికి కీలక మంత్రుల నిష్క్రమణలతో తుపాన్ స్థాయికి చేరింది.తొలుత దేశ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే, భారతీయ సంతతికి చెందిన దేశ ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి రాజీనామాలు సమర్పించారు. బుధవారం దేశ కుటుంబ, శిశు వ్యవహారాల మంత్రి విల్ క్విన్స్, రవాణా శాఖను నిర్వహిస్తున్న మహిళా మంత్రి లౌరా ట్రోట్, ఆ తరువాత మరో ఇద్దరు మంత్రులు జాన్ గ్లీన్, విక్టోరియా అట్కిన్స్ తమ రాజీనామాలు సమర్పించారు.
పార్టీ గేట్ స్కామ్‌తో తీరని కష్టాలలో పడి, చివరికి ఈ వ్యవహారంపై పార్లమెంట్ అభిశంసన స్థాయి వరకూ చేరుకున్న జాన్సన్ బుధవారం మరింత ముట్టడికి గురయ్యారు. 2019లో సెక్స్ స్కామ్‌లో చిక్కిన సీనియర్ ఎంపి క్రిస్ పించర్‌కు జాన్సన్ ఆ తరువాత కేబినెట్‌లో కీలక పదవి ఇవ్వడం సీనియర్ మంత్రుల రాజీనామాలకు దారితీసింది. జాన్సన్ సారధ్యపు ప్రభుత్వం విశ్వాసం కోల్పోతోందని, ఇందులో కొనసాగడం కుదరదని లౌరా ట్రోట్ తమ రాజీనామా లేఖలో తెలిపారు. ఇక రాజీనామాకు దిగడం తప్ప మరో దారి లేని పరిస్థితి ఏర్పడిందని మరో మంత్రి క్విన్స్ స్పందించారు. వివాదాస్పద రాజకీయ నాయకుడు ఒకరికి జాన్సన్ ఇంటర్వూ ఇవ్వడం, పైగా కీలక పదవి కట్టబెట్టడం, వివరణ కోరితే అసందర్భంగా మాట్లాడటం ఇవన్నీ తాను భరించలేకపోతున్నట్లు తెలిపారు. ఇటీవలే జాన్సన్ ప్రభుత్వం సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ఏదో విధంగా బయటపడ్డారు. అవినీతి మసి అంటిన ప్రభుత్వంలో ఇమిడి ఉండటం కుదరదని మంత్రులు స్పష్టం చేశారు. పలువురు ఎంపిలు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అధికార కన్సర్వేటివ్ పార్టీకి చెందిన టోరీలు కూడా జాన్సన్ అసమర్థతపై మండిపడుతున్నారు. దేశలో అత్యంత కీలకమైన ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రులు రాజీనామాలకు దిగడం ప్రభుత్వ కార్యకలాపాలకు విఘాతం అయ్యేలా పరిస్థితి మారింది. 24 గంటల వ్యవధిలోనే 11 మంది ఎంపిలు కూడా రాజీనామాలు సమర్పించారు.
రాజీనామా చేసేది లేదు..కొనసాగుతా
తాజాగా తేల్చిచెప్పిన ప్రధాని జాన్సన్
పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రధాని బోరిస్ జాన్సన్ బుధవారం స్పష్టం చేశారు. ఇప్పటికీ ఆరుగురు మంత్రులు రాజీనామా చేసిన దశలో ఆయన స్పందించారు. పార్లమెంట్ నుంచి పొందిన అధికార నిర్వహణ తీర్పుకు అనుగుణంగా తాను పనిచేస్తానని, పదవిలో కొనసాగుతానని తెలిపారు. అయితే వరుసగా మంత్రుల రాజీనామాలతో ఆయన అధికార నిర్వహణపై పట్టు కోల్పోతున్న సంకేతాలు వెలువడ్డాయి. పార్లమెంట్ వీక్లిసెషన్‌లో టోరీలు, అటు లేబర్ పార్టీ ఎంపిల నుంచి కూడా ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో ఆయన వారి వాదనను తిప్పికొట్టారు. ధైర్యంగా నిజాయితీగా చెప్పాలంటే, ప్రధాని పదవిలో ఉండేవారు గడ్డు పరిస్థితుల నడుమనే పనిచేయాల్సి ఉంటుంది. అధికారంలో సాగేందుకు మీరే బలీయమైన తీర్పు ఇచ్చారు. ఈ మేరకు ముందుకు సాగాలనే నిర్ణయించుకున్నానని తెలిపారు. 24 గంటల వ్యవధిలో ఆరుగురు మంత్రుల రాజీనామాలు, తరువాత సభలో గంటల తరబడి సభ్యుల నుంచి విమర్శలు, మరో వైపు హౌస్ ఆఫ్ కామన్స్‌లోని అత్యంత శక్తివంతమైన కమిటీల ఛైర్మన్‌ల నిలదీతల నడుమ చిక్కిన దశలోనే జాన్సన్ తాను వైదొలిగేది లేదని తెలిపారు. ఆర్థిక మంత్రిగా ఇంతకు ముందటి విద్యాశాఖ మంత్రి, వ్యాపారవేత్త నధీమ్ జహావీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఇతర ఖాళీల భర్తీకి కూడా చర్యలు చేపట్టారు. నెలరోజుల క్రితమే జాన్సన్‌పై వచ్చిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో ఆయన స్వల్పంగా బయటపడ్డారు. బ్రిటన్‌లో ఉన్న పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ఒక్కసారి అవిశ్వాసం ఎదుర్కొన్న ప్రధానిపై ఏడాది వరకూ దీనిని లేవనెత్తడానికి వీల్లేదు. ఈ కోణంలో ఇప్పుడు పలు చిక్కులు తలెత్తినా జాన్సన్ పదవిలో ఉండేందుకు వీలుంటుంది. అయితే అవసరం అయితే ఈ నిబంధనలను తిరగరాయడానికి సిద్ధపడుతున్నట్లు మంత్రివర్గేత టోరీ ఎంపిల బలీయమైన 1922 కమిటీ యోచిస్తున్నట్లు వెల్లడైంది.

6 UK Minister resign from PM Johnson’s Cabinet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News