Sunday, February 23, 2025

లిఫ్టులో ఇరుక్కున్న బాలుడు చికిత్స పొందుతూ మృతి

- Advertisement -
- Advertisement -

అపార్ట్‌మెంట్‌లో లిఫ్టులో అర్ధంతరంగా ఇరుక్కున్న తీవ్ర ఇబ్బందులు పడిన బాలుడు అర్నాఫ్ (5) నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో అవయవాలు పూర్తిగా దెబ్బతిని విషమ పరిస్థితుల్లో వెంటిలేటర్‌పై మెరుగైన వైద్యం అందిస్తూ శనివారం మధ్యాహ్నాం 12.40 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు దృవీకరించారు. అభం శుభం తెలియని, అల్లారి ముద్దుగా పెరిగిన బాలుడు మృతి చెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి రోధనలతో ఆస్పత్రి మిన్నంటాయి..బాలుడి మృతి విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆచార్య రవీకుమార్ వెల్లడించారు. మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. దీంతో బాలుడి బంధుమిత్రుల కన్నీంటి పర్యంతంతో ఆస్పత్రి,

శాంతినగర్ మాఫర్ అపార్ట్‌మెంట్‌లో దు:ఖ వాతావరణం కనిపించింది. లిఫ్టులో మూడు గంటలపాటు చిక్కిపోయి నానా యతన అనుభవించిన బాలుడ్ని ప్రాణాలతో కాపాడేందుకు తమ వైద్య బృందం ఎంతగానో శ్రమించిన ఫలితం లేదని, ఇది బాధకరమని ఆచార్యరవీకుమార్ పేర్కొన్నారు. లిఫ్టులో బాలుడి అవయవాలు పూర్తిగా పాడైపోయాయి. విషమ పరిస్థితుల్లో ఉన్న బాలుడిని బతికించేందుకు కార్డియా , పిడియాట్రిషీయన్ ఇతర విభాగాల వైద్యులు బృందం చేసిన యత్నాలు ఫలించలేదన్నారు. అతని అవయవాలు నష్టపోయాయి, కిడ్నీ పాడైపోయావని ఆయన వివరించారు. లిఫ్టులో బాలుడికి రక్తప్రసరణ లేదు, ఫిట్స్ వచ్చాయి. దీంతో అతని పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News