Sunday, March 23, 2025

ఈ ఆరేళ్ల చిన్నారి.. మరో రోహిత్ శర్మ.. అదే స్టైల్‌!

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా ఆటగాళ్లంటే.. మన దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచంలోనూ అభిమానులు ఉంటారు. స్టార్ బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. తదితరులను ఆదర్శంగా తీసుకొని క్రికెటర్ అవ్వాలని చాలా మంది భావిస్తుంటారు. భారత్‌లోనూ కాదు పాకిస్థాన్‌లోనూ భారత క్రికెటర్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకు నిదర్శనమే ఈ వీడియో అయితే పాకిస్థాన్‌కు చెందిన ఓ ఆరేళ్ల చిన్నారి బ్యాటింగ్.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను గుర్తుకు తెస్తుంది. సోనియా ఖాన్ అనే ఈ చిన్నారి క్రీజ్‌లో ఉంటూ రోహిత్ శర్మ ఐకానిక్ పుల్ షాట్ కొట్టే తీరు నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. దాంతో పాటు లాంగ్ ఆన్ దిశగా, కవర్స్ దిశగా ఆ చిన్నారి చాలా పర్‌ఫెక్ట్‌గా బ్యాటింగ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇప్పుడే దిగ్గజ క్రికెటర్లతో పోల్చలేము కానీ.. ఆ చిన్నారి మాత్రం సరైన శిక్షణ, ప్రొత్సాహం ఉంటే గొప్ప క్రికెటర్ అవుతుంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News