Monday, December 23, 2024

తిరుమలలో విషాదం.. కాలినడకన వెళ్తున్న చిన్నారిపై చిరుత దాడి..

- Advertisement -
- Advertisement -

చిత్తూరు: తిరుమలో విషాద ఘటన చోటుచేసుకుంది. తిరమల కాలినడక మార్గంలో అలిపిరి వద్ద భక్తలపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో ఆరేళ్ల బాలిక మృతి చెందింది. నిన్న(శుక్రవారం) రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ కుటుంబం కాలినడకన తిరుమలకు బయల్దేరింది. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆలయం వద్ద నడిచి వెళ్తున్న బాలికపై ఒక్కసారిగా చిరుత అటాక్ చేసి లాక్కెళ్లింది. దీంతో తల్లిదండ్రులు భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. మృతి చెందిన బాలిక లక్షిత(6)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News